KCC transcript #16216

TELANGANA · JAGTIAL · Plant Protection

Query

stem borer management in paddy

KCC answer

చీడపీడల యాజమాన్యం (అన్ని పద్ధతులకు) తెలంగాణలో వివిధ రకాల పురుగుల వల్ల వరిలో సుమారు 25-30 శాతం దిగుబడులు తగ్గి రైతాంగం నష్టపోతున్నారు. వాటిలో కాండం తొలిచే పురుగు మరియు నుడిదోమ అత్యంత ప్రమాదమైనది. వాటి గురించి విపులంగా ఈ క్రింద పొందుపరుస్తూ, మిగితా పురుగుల గురించి పట్టిక(2) లో పొందుపరచడం జరిగింది. కాండం తొలిచే పురుగు (మొగి పురుగు/తెల్లకంకి/ఊసపోటు) నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే ఈనిన తరువాత తెల్లకంకులు బయటకు వస్తాయి. ఆలస్యంగా లేకా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటలు కంటే ఎక్కువ, నత్రజని తక్కువగా వాడటం వలన కాండం బలహీనం కావడం ఈ పురుగు ఆశించడానికి అనుకూలం. ముఖ్యంగా యాసంగి వరి పైరులో ఎక్కువగా ఆశిస్తుంది. ముదురు గోధుమ/ ఎండుగడ్డి/ పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కలపై నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడిన గ్రుడ్ల సముదాయం చిన్న గోధుమ రంగు ముద్ద వలె ఆకు కొనలపై లేదా కాండం మీద కనబడుతుంది. తెలుపు-గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగుల (లార్వా) తల ఎదిగిన తర్వాత నారింజ-పసుపు రంగు కలిగి ఉంటుంది. చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేకా గ్రుడ్ల సముదాయం లేదా 10 శాతం చచ్చిన మొవ్వులు లేదా లింగాకర్షక బుట్టలలో వారానికి బుట్టకు 25-30 మగ రెక్కల పురుగులు గమనించినప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు పీకే 7 రోజుల ముందు 2 గంటల (200 చ.మీ.) నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చెయాలి. ముదురు నారు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి నాటాలి. ట్రైకోగ్రామా గ్రుడ్లు వారన్న జీవులను నాటిన 25 రోజుల నుండి ఎకారకు 4 కార్డుల చొప్పున లేదా ఎసిఫేట్ 75 ఎస్.పి. 1.5 గ్రా. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. అంకురం నుండి చిరుపొట్ట దశలో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్.సి 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలుపు పిచికారి చేయాలి.
SectorAGRICULTURE
CategoryCereals
CropPaddy (Dhan)
SeasonNA
Created (source)2025-05-21T12:07:03.313
Last synced2026-04-03 15:00:03

Official agriculture information: agricoop.gov.in.

FAQ

Is this legal or financial advice?
No. This page reproduces open government transcript data for information only. For schemes, subsidies, or emergencies, contact official agriculture helplines and your local extension officers.
How do I verify the answer?
Compare with current guidance from the Department of Agriculture and Farmers Welfare and official state agriculture portals. Policies and schemes change over time.

About this tool

The Kisan Call Centre (KCC) helps farmers with crop, weather, and scheme-related queries through a national helpline. DeshSeva shows anonymised transcript-style records held in our database so you can explore common questions and responses.

  • DeshSeva does not mirror the full historical record. We sync a bounded sample per state and month.
  • Answers may appear in English, Hindi, Tamil, or other languages as in the source.
  • For programme rules and helpline numbers, rely on agricoop.gov.in and your state agriculture department.